పాతాళానికి జలాలు.. ఎండిపోతున్న భూమి
తెలంగాణ వ్యాప్తంగా 2025 సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు 4.41 మీటర్ల దిగువన ఉంటే.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 7.52 మీటర్ల దిగువకు పడిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రోజురోజుకు ప్రమాదకరస్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా యావరేజిగా భూగర్భ జలాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు 11 మీటర్ల దిగువకు పడిపోయింది.
- గ్రేటర్లో ప్రమాదకరంగా గ్రౌండ్ వాటర్ లెవల్స్
- జలమండలి నీళ్లు సరిపోక నగర ప్రజల అవస్థలు
- వేధిస్తున్న లోప్రెషర్, కలుషిత నీటి సమస్య
- ప్రత్యామ్నాయం చూపాలంటున్న వినియోగదారులు
నగరాన్ని నీటి కొరత చుట్టుముడుతున్నది. ఒకవైపు గ్రేటర్‌కు నీళ్లందించే ప్రాజెక్టుల్లో జలమట్టాలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. వెరసి ఇండ్లలోని బోర్లన్నీ ఎండిపోతున్నాయి. జలమండలి నీళ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. అక్టోబర్ ద్వితీయార్థంలోనే భూగర్భ జలాల క్షీణత వేసవిని తలపిస్తున్నది. గతేడాది రెట్టింపు దిగువకు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో అత్యంత వేగంగా దిగువకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బోర్లు ఎండిపోయి, భూగర్భ జలాలు పడిపోయి, జలమండలి నీళ్లు సక్రమంగా సరఫరా కాకపోవడంతో సిటీజనం అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా మరింత వేధిస్తున్నది.
– సిటీబ్యూరో,తెలంగాణ
గుక్కెడు నీటికి పాట్లు
ఉప్పల్ మెయిన్ రోడ్డులో పైపులైన్ లీకేజీ నుంచి వృథాగా పోతున్న నీటిని కమలమ్మ అనే వృద్ధురాలు ఇలా క్యాన్‌లో నింపుకొంటున్నది. నగరంలో తాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉందో అద్దంపడుతున్నదీ చిత్రం.
గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రోజురోజుకు ప్రమాదకరస్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా యావరేజిగా భూగర్భ జలాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు 11 మీటర్ల దిగువకు పడిపోయింది. గ్రేటర్ జిల్లాలైన రంగారెడ్డిలో అత్యధికంగా 11.74 మీటర్ల దిగువకు పడిపోయాయి.
అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వ్యాప్తంగా 2025 సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు 4.41 మీటర్ల దిగువన ఉంటే.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 7.52 మీటర్ల దిగువకు పడిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రోజురోజుకు ప్రమాదకరస్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా యావరేజిగా భూగర్భ జలాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు 11 మీటర్ల దిగువకు పడిపోయింది. గ్రేటర్ జిల్లాలైన రంగారెడ్డిలో అత్యధికంగా 11.74 మీటర్ల దిగువకు పడిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11.64 మీటర్లు, హైదరాబాద్ జిల్లాలో 10.01 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. దీంతో సిటీలోని బోర్లన్నీ అడుగంటి పోతున్నాయి. ముఖ్యంగా సైబర్ సిటీ ప్రాంతాలైన వెస్ట్ సిటీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితులు మార్చి, ఏప్రిల్ నాటి రోజులను తలపిస్తున్నాయి. జలమండలి నీళ్లు ఏ మూలకు సరిపోకపోవడంతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే రికార్డుస్థాయిలో బుకింగ్స్ నమోదవుతున్నాయి. కమర్షియల్, గేటెడ్ కమ్యూనిటీల్లో నీటి కొరత తీవ్ర తరం అవుతుండటంతో మెయింటెనెన్స్ చార్జీలు పెంచుతున్నారు. బస్తీలు, కాలనీల్లో బిందెలు పట్టుకుని రోడ్డెక్కుతున్నారు. నీటి కొరత వేధిస్తుండటంతో జలమండలికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్లో 700 ఎంజీడీల డిమాండ్
గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో బోర్లు వేసవి మాదిరిగా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే జలమండలి నీళ్లు సక్రమంగా సరఫరా కాకున్నా బోర్ల నీటిని వాడుకునేవారు. గేటెడ్ కమ్యూనిటీలు, సొసైటీలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఎక్కువగా బోర్లపైనే ఆధారపడేవారు. ఇప్పుడు అవి పూర్తిగా వట్టిపోతుండటంతో పూర్తిగా జలమండలి నీటిపైనే ఆధారపడుతున్నారు. గతేడాది దాకా సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో నీటి డిమాండ్ ఉండకపోయేది. డిసెంబర్ దాటిన తర్వాత గ్రేటర్లో 500 నుంచి 600 ఎంజీడీల డిమాండ్ ఉండేది. కానీ అక్టోబర్ నెలలోనే నీటి డిమాండ్ 700 ఎంజీడీలకు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే రికార్డు అని జలమండలి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అందుకే ఇప్పటి నుంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

