BRS Party | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతల సమావేశం
BRS Party | గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, మహముద్ అలీతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు.
BRS Party | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, మహముద్ అలీతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
మరికాసేపట్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. శనివారం జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం (కౌన్సిల్) ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

