సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు ఆయా ప్రాంతాల్లో బర్త్‌డే కేక్‌కట్ చేసి సంబురాలు చేశారు. పలుచోట్ల రక్తదానం, అన్నదానం, చీరల పంపిణీ, రోగులకు పండ్లు పంపిణీ, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ కేక్‌కట్ చేసి సుమారు 2000 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు శంభీపూర్‌లోని తన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇతర నాయకులు ఆయా నియోజకవర్గంలో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టారు.
ఉప్పల్ : ఉప్పల్ డివిజన్లోని భరత్‌నగర్‌లో బుధవారం ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులకు పిల్లి నాగరాజు చేతులమీదుగా స్కూల్ యునిఫామ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేకల హనుమంతారెడ్డి, గోనె అర్జున్‌రెడ్డి, ఎం.అంజిరెడ్డి, మంచికంటి రాజు, వర్ధన్, మించ కృష్ణ, రంగ భాస్కర్‌గౌడ్, కాయ హనుమంత్, శివ, సలీం, బూడిద జాంగీర్ గౌడ్, అల్లాభాష, అరటికాయల శ్రీనివాస్, ఎం.హరి, ఎం.జానార్దన్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మణికొండ మున్సిపాలిటీలో బుధవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దూళిపాళ్ల సీతారాం, కుంభగళ ధన్‌రాజ్, ఉపేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
– మణికొండ,జూలై 24