వరదను ఆపి.. దారిని చూపి
అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
అకాల వర్షంపై సకాలంలో స్పందించిన జీహెచ్ఎంసీ
ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
నీళ్లు నిల్వకుండా పనులు, చెట్లకొమ్మల తొలగింపు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి సిబ్బంది
ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవగా.. అత్యధికంగా సీతాఫల్మండిలో 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
గ్రేటర్‌వ్యాప్తంగా భారీవర్షం కురిసింది. భారీ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం రావడంతో వెంటనే బల్దియా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన మార్గాలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలువకుండా 128 ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. వరద సాఫీగా పోయేలా చూడడంతోపాటు గాలులకు విరిగిపడిన చెట్లకొమ్మలను తొలగించాయి. ఒకచోట కరెంటు స్తంభం నేలకొరగగా, గోల్నాక వద్ద ఇండ్లు కూలి నలుగురికి గాయాలయ్యాయి. పురపాలక మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశాలతో ఉన్నతాధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. వర్షాల వల్ల ఏమైనా అవస్థలు ఎదురైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-21111111ను సంప్రదించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరవాసులకు సూచించారు.
సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్, యూబీడీ, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 128 స్టాటిక్ బృందాలను పంపారు.
అక్కడక్కడ విరిగి పడిన చెట్లను డీఆర్ఎఫ్ బృందాలు తొలగించగా.. ఇతర సమస్యల పరిష్కారానికి 128 మినీ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షాలతో ఏవైనా సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-2111 1111 నంబర్‌కు ఫోన్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
సహాయ చర్యలు ఇలా..
- బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 48 ఫిర్యాదులను స్వీకరించిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు ఆ ప్రదేశాలకు వెళ్లి స్థానికుల ఇబ్బందులను తొలగించారు.
- సికింద్రాబాద్ జోన్లో 54 ప్రాంతాల్లో అధికారులు ముంపు నివారణ చర్యలు చేపట్టారు. మరో ఏడు చోట్ల విరిగిపోయిన చెట్లను తొలగించారు. అంబర్‌పేట, గోల్నాక వార్డులో ఇండ్లు కూలడంతో నలుగురు గాయాలపాలయ్యారని కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
- చార్మినార్ జోన్లో 35 ప్రాంతాల్లో నీరు నిలవగా అధికారులు తొలగించారు. మూడుచోట్ల పడిపోయిన చెట్లను తొలగించారు.
- ఖైరతాబాద్ జోన్లో 71 ప్రాంతాల్లో వరద నీటిని తొలగించారు. పడిపోయిన 42 చెట్లను తీసేశారు.
- నాల పనుల కారణంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి హిందీ మహా విద్యాలయకు వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా పోలీసులు వెంటనే పరిష్కరించారు.
- యాకత్‌పూర నియోజకవర్గంలోని రెయిన్‌బజార్, తలాబ్‌కట్ట ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకోగా విషయం తెలుసుకున్న కలెక్టర్ శర్మన్ వెంటనే ఆ ప్రాంతాల్లో పర్యటించారు.
- విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పం పిణీ సంస్థ అధికారులు కంట్రోల్ రూం ఏర్పా టు చేశారు. అంతేకాక ట్విట్టర్ ద్వారా వచ్చిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించారు.
మరో మూడు రోజులు వర్షం..
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీఎస్‌డీపీఎస్ అధికారుల వివరాల ప్రకారం సీతాఫల్ మండిలో అత్యధికంగా 8.6 సెం.మీలు, జీడిమెట్ల గాయత్రీనగర్‌లో అత్యల్పంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైంది. మరోవైపు మరో మూడు రోజులు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Clear
- GHMC
- Hyderabad
- Rain water
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

