సిటీబ్యూరో, సెప్టెంబరు 4 (నమస్తే తెలంగాణ ): వర్షాకాలం వచ్చిందంటే చాలు స్టార్మ్ వాటర్ డ్రైన్లు పొంగి పొర్లడం, ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవ్వడం వంటివి వింటూనే ఉంటాం. వర్షపు కాల్వలకు చెత్త, చెదారం అడ్డు పడటం, కాల్వలు దెబ్బతినడం, అధిక వర్షపాతం పడటం వంటి కారణాలతో కాల్వలు పొంగిపొర్లుతుంటాయి. రానున్న రోజుల్లో నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సాంకేతికత దన్నుగా స్మార్ట్ పరిషారం చూపనుంది.
ఈ మేరకు వర్షపు నీటి కాలువల శుభ్రతకు జీహెచ్ఎంసీ రోబోటిక్ సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. మొట్టమొదటగా సరిల్-12లో పైలట్ ప్రాజెక్ట్‌గా స్మార్ట్ వాటర్ డ్రైన్ క్లీనింగ్ ను ప్రారంభించింది. అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్న రోబోటిక్ యంత్రాల ద్వారా ప్రధాన రోడ్డు క్రాసింగ్‌లో వర్షపు నీటి కాలువల శుభ్రత చేపట్టగా, చీఫ్ ఇంజినీర్ (మెయింటెనెన్స్) సహదేవ్ రత్నాకర్ ఈ విధానంలో క్లీనింగ్ ప్రక్రియను బుధవారం రాత్రి మెహదీ పట్నం, ఎన్ఎండీసీ జంక్షన్లో పరిశీలించారు.
నూతన పద్ధతి ముఖ్య లక్ష్యాలు కాలువల్లోని అడ్డంకులను గుర్తించి, తొలగించడం, బురదను వేగంగా, సమర్థవంతంగా తొలగించడం, వర్షాల సమయంలో నీటి నిల్వలను తగ్గించి, డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఫీల్డ్ స్టాఫ్, ప్రజల భద్రతకు ఎలాంటి హాని జరగకుండా కఠిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ క్లీనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ విధానం సఫలీకృతమైతే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సరిల్లలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోబోటిక్ టెక్నాలజీతో స్మార్ట్ వాటర్ డ్రైన్ క్లీనింగ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా నగరంలో ప్రారంభించామని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.