సిటీబ్యూరో, మార్చి 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ఆరు రాష్ర్టాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు బెస్ట్ ప్రాక్టీసెస్‌పై అధ్యయనం చేయడానికి జీహెచ్ఎంసీని శుక్రవారం సందర్శించారు. ముస్సోరిలో ట్రైనింగ్ పొందుతున్న హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలకు చెందిన 16 మంది ఐఏఎస్‌లు రెండు రోజుల పర్యటనలో భాగంగా జీహెచ్ఎంసీకి వచ్చారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో కమిషనర్ రొనాల్డ్ రాస్ జీహెచ్ఎంసీ బెస్ట్ ప్రాక్టీసెస్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సీ అండ్ డీ వేస్ట్ ప్రాసెసింగ్, చెత్త సేకరణ, జీవీపీ, ఎలిమినేషన్, ఎస్ఆర్డీపీ , టౌన్ ప్లానింగ్, ఇంటి నిర్మాణ అనుమతులు, యూబీడీ ద్వారా చేపట్టిన గ్రీనరీ, మోడల్ గ్రేవ్ యార్డు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్, మోడల్ మార్కెట్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, స్ట్రీట్ లైటింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్, లేక్స్ అభివృద్ధి, పీఎం స్వానిధి, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ సిస్టం, వేస్ట్ రీసైక్లింగ్, నగర పౌరులకు అందిస్తున్న సేవలు, హరితహారం, నిధుల సమీకరణ, శానిటేషన్లపై వివరించారు.
నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టిన బెస్ట్ ప్రాక్టీసెస్ బాగున్నాయని ట్రైనీ ఐఏఎస్‌లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లు దుండిగల్, జవహర్ నగర్లో గల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, టీ-హబ్, ఇండస్ట్రీయల్ పార్కును సందర్శించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు రమేష్ ఆర్.దామోర్, దుని చంద్ రాణా, రోహిత్ జామ్ వాల్, దిశా ప్రణయ్ నాగ్ వంశీ, అనురాగ్ సక్సేనా, శుచి స్మిత సక్సేనా, అవినాష్ ప్రభాకర్ రావ్ పాఠక్, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పితాంబర్ దియోరే, ప్రకాష్ బాబురావు ఖాప్లీ, జీహెచ్ఎంసీ అధికారులు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి, ఈఎస్సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, డాక్టర్ సునంద, వెటర్నరీ డీడీ డాక్టర్ విల్సన్ పాల్గొన్నారు.