
సిటీబ్యూరో, నవంబరు 5(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ స్థాయీ సం ఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు ఇటీవల షెడ్యూల్ విడుదల కాగా, ఇందులో ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు రోజూ ఉదయం 11 గంట ల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ (సెలవు రోజులైన 4, 7వ తేదీలు మినహా) ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగానే వార్డు నంబరు 5 మల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేష న్ దాఖలు చేశారు. మీర్పేట హెచ్బీ కాలనీకి చెందిన కార్పొరేటర్ ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డిని ప్రతిపాదించినట్లు అధికారులు చెప్పారు. కాగా, 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉం టుందని, పోటీలో 15మంది కన్నా ఎక్కువ మంది నిలిస్తే 20వ తేదీన జీహెచ్ ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక పక్రియను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని పేర్కొ న్నారు. కార్పొరేటర్లు మాత్రమే పోటీలో నిలిచేందుకు అర్హులని చెప్పారు.