
సిటీబ్యూరో, అక్టోబరు 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు పెద్ద ఎత్తున జరిగాయి. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పలువురిని వివిధ మున్సిపాలిటీలకు కమిషనర్లగా పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 15 మందిని బదిలీ చేశారు. ఖాళీగా ఉన్న నిజాంపేట కమిషనర్‌గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శంకరయ్యను, మీర్పేట్ కమిషనర్‌గా వరంగల్‌లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న నాగేశ్వర్‌ను, జీహెచ్ఎంసీలో డీడీగా పనిచేస్తున్న రామకృష్ణారావును పీర్జాదిగూడ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న రవీందర్ సాగర్‌ను మిర్యాలగూడ కమిషనర్‌గా, మేడ్చల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డిని నిర్మల్‌కు, సీడీఎంఏ కార్యాలయ సూపరిటెండెంట్ జానకీ రామ్ సాగర్, ఇబ్రహీంపట్నం కమిషనర్ జయంత్ కుమార్‌రెడ్డిని షాద్‌నగర్‌కు, గుండ్ల పోచంపల్లి కమిషనర్ అమరేందర్ రెడ్డిని ఆదిభట్లకు, గుండ్ల పోచంపల్లికి లావణ్యను బదిలీ చేశారు. టీయూఎఫ్ఐడీసీ ఏడీ ఎంఎన్ఆర్ జ్యోతిని తుర్కయాంజల్ కమిషనర్‌గా, సీడీఎంఏ కార్యాలయ జేడీ ఫాల్గున్ కుమార్‌ను మణికొండ మున్సిపాలిటికి, అక్కడ పనిచేస్తున్న జయంత్‌ను సీడీఎంఏ కార్యాలయంలో జేడీగా పోస్టింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ యూసఫ్‌ను ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా, మేడ్చల్ కమిషనర్‌గా అహ్మద్ సైఫుల్లాను, పంచాయతీ రాజ్ శాఖ డీఎల్పీవో జ్యోతిరెడ్డిని జవహర్ నగర్ కమిషనర్‌గా నియమిస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.