
ఉప్పందిస్తూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తున్నారు. కేవలం ఏడాదికాలంలో 26 ఖరీదైన ప్రాంతాల్లో 38,705 చదరపు గజాల (సుమారు 8ఎకరాలు)ను బల్దియా అధికారులు కబ్జాల నుంచి రక్షించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వెంటనే సమాచారమందించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గత జూలై 6న టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం అస్సెట్ ప్రొటెక్షన్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదు/సమాచారంపై తక్షణం రంగంలోకి దిగి కబ్జాలను నిలువరించి స్థలాలను కాపాడుతున్నది. ఆక్రమణలను కూల్చివేసి బోర్డులు, గేట్లు ఏర్పాటు చేయడంతోపాటు కొన్నిచోట్ల పార్కులను నిర్మించారు. బల్దియా కేవలం ఏడాదికాలంలో పౌరుల భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతోపాటు వాటిని అభివృద్ధి చేస్తూ ఆహ్లాదం పంచుతున్నది.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా చెరువులు, నాలాలు, పార్కులు కబ్జా లేదా ఆక్రమణ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారమివ్వాలి. తమ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణలను కూల్చివేస్తారు. కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ అందరి బాధ్యత. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. -విశ్వజీత్, ఈవీడీఎం డైరెక్టర్
చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడే వారి భరతం పట్టేందుకు గతేడాది జూలై 6న పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు టోల్ ఫ్రీ నంబరు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో పౌరులను భాగస్వామ్యం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం అస్సెట్ ప్రొటెక్షన్‌ను సెల్‌కు వచ్చిన ఫిర్యాదు/సమాచారంపై తక్షణమే రంగంలోకి దిగి కబ్జా కోరల్లో చిక్కుకున్న స్థలాలను కాపాడుతున్నది. వెంటనే జీహెచ్ఎంసీ బోర్డుతో పాటు గేట్లు ఏర్పాటు చేయడం, నిర్మాణాలు ఉంటే కూల్చివేతలు లాంటివి చేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో కోర్టు పరిధిలో ఉన్న వాటిని సమగ్ర స్థాయిలో వాదనలు వినిపించి కబ్జాల నుంచి జీహెచ్ఎంసీ స్థలాలను తిరిగి దక్కించుకుంటున్నారు.ఇప్పటి వరకు ఖరీదైన ప్రాంతాలైన దాదాపు 26 చోట్ల 38705 చదరపు గజాలు కబ్జాల నుంచి విముక్తి లభించి వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలను జీహెచ్ఎంసీ రికార్డులోకి చేర్చారు. ఇప్పటి వరకు 8ఎకరాల మేర ప్రభుత్వ భూములను తిరిగి దక్కించుకుని అట్టి స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో పౌరులు భాగస్వామ్యం కావాలని, కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఈ సందర్భంగా తెలిపారు.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా 1800-599-0099 టోల్ ఫ్రీ నంబర్‌కి పౌరులు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని విశ్వజిత్ కంపాటి పేర్కొన్నారు. కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపడంలో నగర పౌరులు ప్రభుత్వం చేతిలో చెయ్యి వేసి కదిలారు..ప్రభుత్వ ఆస్తుల రక్షణలో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూస్తున్నారు. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడితే వారి భరతం పట్టేందుకు గతేడాది జూలై 6న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చి ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో పౌరులను భాగస్వామ్యం చేశారు. రేపటితో ఏడాది పూర్తవుతుండగా, ఈ సంవత్సర కాలంలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో అద్భుత ఫలితాలను సాధించింది.