
సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): కూలేందుకు సిద్ధంగా ఉన్న శిథిల భవనాలను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వానకాలం నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ నగరంలో మున్సిపల్ సర్కిల్స్ వారీగా పురాతన భవనాలను గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు శనివారం ఐదు ప్రాంతాల్లో పురాతర భవనాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 127 పురాతన/ శిథిల భవనాలను కూల్చివేశామని, ఇందులో ఎల్బీ నగర్ సర్కిల్లో 12, చార్మినార్‌లో 48, ఖైరతాబాద్‌లో 4, శేరిలింగంపల్లిలో 3, కూకట్‌పల్లిలో 10, సికింద్రాబాద్‌లో 50 వరకు కూల్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అలాగే, మరో 67 పురాతన భవనాలలో ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. వీటిలో కొన్నింటికి మరమ్మతులు చేయించినట్లు అధికారులు తెలిపారు.