సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): గంజాయి విక్రయాలకు సంబంధించి 10 కేసుల్లో మోస్ట్ వాం టెడ్‌గా ఉన్న అంగూరిబాయిని అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన అంగూరిబాయి పెద్దఎత్తున గంజాయి విక్రయాలు జరుపుతూ ఇప్పటికే 13 కేసుల్లో జైలు శిక్ష అనుభవించింది. అయినా ప్రవర్తన మార్చుకోకుండా పదే పదే నేరాలకు పాల్పడుతున్నది.
ఈ క్రమంలో నిందితురాలిపై 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్లో 3 కేసులు, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌లో 4 కేసు లు, ఆసిఫ్‌నగర్, గౌరారం పోలీస్స్టేషన్లలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, 10 కేసుల్లో అబ్కారీ, లా అండ్ ఆర్డర్ పోలీసులకు దొరక్కుండా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిందితురాలిని ఎట్టకేలకు గురువారం కార్వాన్ ప్రాంతంలో ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు.