హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు (Ganja Chocolates) అమ్ముతుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. పేట్‌బషీరాబాద్‌లోని సుబాష్‌నగర్‌లో ఉన్న కోమల్ కిరాణా దుకాణంలో మేడ్చల్ ఎస్వోటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఐదు ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న పివేష్ పాండే అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆరు నెలలుగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.