సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రమైన టీహబ్ స్టార్టప్ పోర్టల్‌కు(T- Hub Startup Portal) పెద్ద మొత్తం నిధులు సమకూరాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాయామం,ఆరోగ్యానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే స్టార్టప్ పోర్టల్ టీ హబ్ మద్దతునిచ్చింది. నిధుల సమీకరణలో భాగంగా సిరీస్ ఏ ఫండింగ్ కింద ఒకేసారి సుమారు 3 మిలియన్ డాలర్లు ( రూ.24 కోట్లు) సమకూరాయి.
భారత్ ఇన్నోవేషన్ ఫండ్ (Bharat Innovation Fund)నుంచి నిధులను పోర్టల్ స్టార్టప్ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాల విస్తరణ, మరిన్ని నూతన ఆవిష్కరణలు చేసేందుకు ఉపయోగించనుంది. స్మార్ట్ హోం జిమ్‌గా పిలిచే 43 అంగుళాల స్క్రీన్ ముందు ఇంటి వద్దే ఉంటూనే వ్యాయామం చేసేలా ఆప్లికేషన్స్ను పోర్టల్ రూపొందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా సేవలను అందిస్తోంది. ‘ది పోర్టల్ స్టూడియో’ పేరుతో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ప్రత్యేకంగా రూపొందించింది.