మంచినీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలి
ఎమ్మెల్యే మాగంటి | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచినీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జలమండలి అధికారులను ఆదేశించారు.

బంజారాహిల్స్,ఆగస్టు 31 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచినీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జలమండలి అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..మంచినీటి సరఫరాలో ఇబ్బందులతో పాటు మురుగు సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు నిధులు మంజూరు చేశామన్నారు. రెండుమూడురోజుల్లో పనులు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
బోరబండ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నాలుగురోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఎమ్మెల్యే మాగంటి అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మల్లారం పంప్ హౌజ్లో వరదనీరు రావడంతో సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించిన వెంటనే నీటి పరఫరా పూర్తిస్థాయిలో జరుగుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
సమావేశంలో జలమండలి డివిజన్-6 జీఎం హరిశంకర్, డీజీఎమ్ దిలీప్కుమార్తో పాటు ఎర్రగడ్డ,ఎస్పీఆర్ హిల్స్, జూబ్లీహిల్స్, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ వాటర్ వర్క్స్ మేనేజర్లు హాజరయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

