Civils Free Coaching | జూలై 31 నుంచి ఓయూ క్యాంపస్‌లో సివిల్స్ ఉచిత కోచింగ్
వచ్చే ఏడాదిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్‌ను జూలై 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఓయూ క్యాంపస్‌లో ఉచిత కోచింగ్‌ను ఇవ్వనున్నారు.
- జూలై 31 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం
- మెరిట్, స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఎంపిక
- జూలై 16న స్క్రీనింగ్ పరీక్ష
- మొత్తం 150 మందికి అవకాశం
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
- ఏర్పాట్లు చేస్తున్న బీసీ స్టడీ సర్కిల్
Civils Free Coaching | సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాదిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్‌ను జూలై 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఓయూ క్యాంపస్‌లో ఉచిత కోచింగ్‌ను ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి 150 మందిని ఎంపిక చేయనున్నారు. సంబంధిత ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో తొలి 50 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయగా, మరో 100 మందిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.ఆశన్న తెలిపారు.
ఈ మేరకు జూలై 16న స్కీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఎంపికైన వారికి లాడ్జింగ్, బోర్డింగ్, రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5,000 చెల్లించబడుతుందన్నారు. ఇందులో ప్రవేశం పొందిన అభ్యర్థులకు రూ.5,000 విలువైన పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుందన్నారు. పైగా లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అయితే, ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా అదికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నం: 040-24071178 లో సంప్రదించాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం www.tsbcstudycircle.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

