సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఇన్సూరెన్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన సైబర్‌నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 20 తులాల బంగారంతో పాటు రూ. 3.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ మహిళ 2012 నుంచి రెండు బ్యాంకుల నుంచి ఆరు పాలసీలు తీసుకొని ఏడేండ్ల పాటు రెన్యువల్ చేస్తూ వచ్చింది. 2019లో తాము ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని.. కంపెనీల పేరుపై రాసి ఉన్న పాలసీల క్లెయిమ్‌లను మార్చుకోవాలని భాను ప్రతాప్‌సింగ్ సూచించాడు. ఇందుకు కొంత చార్జీలు చెల్లించాలని మొదలు పెట్టి రూ.50 లక్షలు కాజేశాడు. దీంతో బాధితురాలు సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం దర్యాప్తు చేపట్టి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి భాను ప్రతాప్‌సింగ్‌ను అరెస్ట్ చేసి నగరానికి తరలించింది.
ఢిల్లీలో ఉంటూ ఇన్యూరెన్స్ కంపెనీ ఏజెంట్‌గా పరిచయం చేసుకుంటూ హైదరాబాద్, ముంబయి, బెంగళూరులో పలు మోసాలకు పాల్పడిన భానుప్రతాప్‌సింగ్ వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. దుబాయ్, బ్యాంకాక్‌కు వెళ్లి జల్సాలు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. దుబాయ్‌లో విలాసాల కోసం ఏకంగా రోజుకు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసేవాడని తెలిసింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలిస్తామంటూ నగరానికి చెందిన ఇద్దరి నుంచి రూ.1.39 లక్షలు కాజేసిన సైబర్‌నేరగాడు రూప్ కిశోర్‌ను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్లో ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇ స్తూ.. రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ, బ్యాం కు ఖాతాల కోసం అంటూ డబ్బు లు వసూలు చేస్తున్న రూప్ సింగ్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేసిన పోలీసులు నగరానికి తీసుకొచ్చిరు.