మెట్రో విస్తరణ గల్లంతు
కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్‌లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
- కేంద్రం మొండి చేయితో ముందుకు సాగని మెట్రో సంస్థ
- భూ సర్వేతోనే ఆగిపోయిన విస్తరణ పనులు
- అనుమతులు కొలిక్కి వస్తేనే ప్రాజెక్టులో కదలిక
సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్‌లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది. ఇటీవల పలు రాష్ర్టాల్లో మెట్రో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, హైదరాబాద్ ప్రాజెక్టును పక్కనపెట్టడంతో ఆ నిర్మాణ సంస్థ కూడా విస్తరణ పనుల విషయంలో సందిగ్ధంలో పడింది.
రెండో దశ మెట్రో విస్తరణ ద్వారా నగరంలో దాదాపు 161 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గానికి కాంగ్రెస్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసి, కేంద్రానికి డీపీఆర్‌లను అందజేసింది. కానీ డిజైనింగ్, నిర్వహణ, జనసాంద్రత వంటి అంశాల విషయంలో కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ స్పష్టత కోరడంతో ఈ ప్రాజెక్టు అనుమతులు జాప్యం అవుతున్నాయి. ఇందులోనే కొన్ని సంక్లిష్టమైన మార్గాలు కూడా ఉండటమే ప్రాజెక్టు ఆమోదానికి జాప్యానికి కారణమనే విమర్శలు ఉన్నాయి.
ఫోర్త్ సిటీకి ప్రాధాన్యత..
కాంగ్రెస్ సర్కారు కూడా నగరంలో మెట్రో విస్తరణ కంటే జనాసంచారమే లేని ఫోర్త్ సిటీకి మెట్రోను పరుగులు పెట్టించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కోర్ సిటీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నార్త్ సిటీ మెట్రో అంశంపై స్థానికంగా తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో అనివార్యంగానే ఆ ప్రాజెక్టును పార్ట్-బీలో చేర్చిన సర్కారు, ఫోర్త్ సిటీ, జేబీఎస్-శామీర్‌పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు అనుమతులు తీసుకునేందుకు సిద్ధమైంది.
కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఏ ప్రాంతానికి విస్తరణ అవసరం అనే విషయాలపై మరింత స్పష్టత కోరడంతో… కాంగ్రెస్ సర్కారు తడబాటు నగర మెట్రో విస్తరణకు శాపంగా మారిందని తెలిసింది. జనాలే లేని ఫోర్త్ సిటీకి మెట్రో ఎందుకనే అంశమే నగరంలో మెట్రో విస్తరణ ప్రధాన అడ్డంకిగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

