శేరిలింగంపల్లి, ఆగస్టు 12: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) క్యాంపస్‌లో గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిస్వజిత్ కలితా అలియాస్ బిస్వా (28) యాక్టర్ ట్రైనర్‌గా పనిచేస్తూ గోపన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా లైకాబలి అతడి స్వస్థలం. అతడు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 1407/2026, ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 27 కింద నమోదైన కేసులో అతను పరారీలో ఉన్నాడు. ఆగస్టు 11న హెచ్‌సీయూ క్యాంపస్‌లో అతడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, 5 గ్రాముల గంజాయి లభించింది.
ఆగస్టు 7న హెచ్‌సీయూలోని మెన్స్-ఎల్ హాస్టల్లో ఓ విద్యార్థి గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఆ విద్యార్థి 10 గ్రాముల డ్రై గంజాయిని రూ. 500కు తన స్నేహితుడు బిస్వజిత్ కలితా వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ఈ సమాచారంతో దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీం నిందితుడి ఆచూకీ గుర్తించి హెచ్‌సీయూ క్యాంపస్‌లో అరెస్ట్ చేశారు. గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా వ్యక్తుల ప్రమేయం ఉందా ? తదితర అంశాలపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.