సిటీబ్యూరో: ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సోమవారం మెహిదీపట్నంలోని స్ట్రీట్ ఫుడ్ జోన్లలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. కొన్ని చోట్ల ఈగలు, దుమ్ము ఉన్న పదార్థాలను పారబోశారు. పలువురికి నోటీసులు జారీ చేసినట్లు, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చిన వెంటనే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.