తెలంగాణ టాపర్‌గా జేహెచ్‌పీఎస్ విద్యార్థి
బంజారాహిల్స్, జనవరి 29: కేంద్ర క్రీడాయువజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సీబీఎస్ఈ విద్యార్థులకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఫిట్ ఇండియా క్విజ్’లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థి వినాయక్ భరద్వాజ్ తెలంగాణ రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచాడు. దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్విజ్గా భావించే ఈ ఆన్లైన్ పోటీల్లో 13502 పాఠశాలల్లో నుంచి 360 స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రిలిమినరీ రౌండ్‌కు అర్హత సాధించారు. తెలంగాణ టాపర్‌గా నిలిచిన వినాయక్ భరద్వాజ్‌ను స్కూల్ చైర్మన్ మురళీ ముకుంద్, ప్రిన్స్‌పల్ వరలక్ష్మి తదితరులు అభినందించారు.