సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 1 : కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని స్పోర్ట్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు పది లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన జమీల్ గత పది సంవత్సరాలుగా కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని రిలయబుల్ బిజినెస్ కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో న్యూ రిలయన్స్ స్పోర్ట్స్ పేరిట దుకాణాన్ని నడిపించడంతో పాటు మూడవ అంతస్తులో స్పోర్ట్స్ గోడౌన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మూడవ అంతస్తులోని గోడౌన్లోనుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దుకాణంలో పనిచేస్తున్న కార్మికులు గమనించి యజమాని జమీల్‌కు, సుల్తాన్‌బజార్ పోలీసులకు, గౌలిగూడ అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రెండు ఫైర్‌ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
నాల్గవ అంతస్తులో దట్టమైన పొగల్లో చిక్కుకున్న నవనీత, ప్రియ, యూసుఫ్, అలీబేగ్లను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ పల్లె పద్మ, కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎండీ హబీబుల్లాఖాన్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సహాయ అగ్నిమాపక శాఖ అధికారి తంగె ళ్ళ శ్రీనివాస్, గౌలిగూడ అగ్నిమాపక శాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. షార్ట్స్ సర్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సుమారు రూ.10 లక్షలకు పైగా నష్టం జరిగిందని వ్యాపారి జమీల్ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.