ఆర్కేపురం, డిసెంబర్ 23 : వంట గ్యాస్ సిలిండర్ (ఎల్పీజీ) అనగానే ఇనుముతో తయారైన గ్యాస్ సిలిండర్ గుర్తుకొస్తుంది. ఇది బరువుగా ఉంటుందన్న విషయం మనసులో తడుతుంది. సిలిండర్ తీసుకున్న సమయంలో నిర్దేశించిన మేరకు సిలిండర్‌లో గ్యాస్ ఉందా..:! లేదా..! అనే విషయం మనకు తెలియదు. గ్యాస్ సిలిండర్‌ను ఇంట్లోనే ఒక చోట నుంచి మరో చోటకు తరలించాలంటే మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడుతుంటారు. వీటన్నింటికీ చమరగీతం పాడుతూ ఇండియన్ గ్యాస్ కంపెనీ ఫైబర్‌తో తయారు చేసిన గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఫైబర్ సిలిండర్‌తో ముప్పు లేదు..
ఇండియన్ గ్యాస్ కొత్తగా ప్రవేశపెట్టిన ఫైబర్ సిలిండర్‌తో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు కొత్త కాంపోజిట్ సిలిండర్ కావాలంటే మార్పిడి కింద ఇస్తున్నాం. పాత ఇనుప సిలిండర్ తీసుకున్న సమయంలో డిపాజిట్ ఎంత చెల్లించారో.. ఆ మొత్తం కాంపోజిట్ సిలిండర్ నుంచి తొలిగించి మిగతా మొత్తం చెల్లించే వెసులు బాటు కల్పించాం. కాంపోజిట్ సిలిండర్ డిపాజిట్ ధర రూ.3600. ప్రస్తుతం సాధారణ గ్యాస్ సిలిండర్‌లో 14 కేజీల గ్యాస్‌కు కంపెనీ రూ.1125లు వసూలు చేస్తున్నది. కాంపోజిట్ సిలిండర్‌లో 10 కేజీలే తూగుతుంది. దీని ధర రూ.810 నిర్ణయించారు. కొత్త గ్యాస్ కనెక్షన్ కాంపోజిట్ సిలిండర్‌తో తీసుకోవాలంటే రూ.5వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.
– కిరణ్‌రావు, గురుదత్త గ్యాస్ ఏజెన్సీ అధినేత