కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 2 : కూకట్పల్లి (కేపీహెచ్బీ కాలనీ) లూలూ మాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన లూలూ బ్యూటీ ఫెస్ట్-2023లో మేల్, ఫిమేల్ మోడల్స్ తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన బ్యూటీ ఫెస్ట్ పోటీలకు ఫెమినా మిస్ ఇండి యా తెలంగాణ ఊర్మిలాచౌహాన్, మిస్ గ్రాండ్ ఇండియా ప్రాచీ నాగ్పాల్, మోడల్ రాజీవ్పిైల్లె న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఫైనల్ పోటీల్లో మోడల్స్ తమ అందచందాలను ప్రదర్శించగా తుది విజేతలకు రూ.2 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో లూలూ మాల్ హైదరాబాద్ హెడ్ ఖదిర్, మార్కెటింగ్ మేనేజర్ ఓమ్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.