థిన్నర్ డబ్బా పేలి .. తండ్రీ కొడుకులకు గాయాలు
థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్‌బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో సంభవించింది
- లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డ్‌లో ఘటన
- భారీ శబ్దం.. భయపడిన స్థానికులు
చిక్కడపల్లి, డిసెంబర్ 15: థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్‌బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో సంభవించింది. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుడితో భారీ శబ్దం వచ్చింది. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ఇన్స్పెక్టర్ మోహన్ రావు, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా నాంచర్ల గ్రామానికి చెందిన చంద్రన్న పదేండ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చాడు. జీవనాధారం కోసం చిత్తు కాగితాలు సేకరిస్తూ, విక్రయించగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం కూడా తన కుమారుడు సురేశ్‌తో కలిసి డంపింగ్ యార్డ్‌కు వచ్చాడు. చెత్తను సేకరిస్తున్న సమయంలో థిన్నర్ డబ్బా కనిపించింది. ఆ డబ్బాను ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చంద్రన్న ఎడమ చెయ్యి పూర్తిగా దెబ్బతిన్నది. పక్కనే ఉన్న సురేశ్ ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి
భారీ శబ్దంతో భయం..
ఈ పేలుడు ఘటనతో భారీ శబ్దం వచ్చింది. స్థానికులు, బాటసారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ బృందాలు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించాయి. డాగ్ స్కాడ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న నేతృత్వంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. సంఘటన స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర, అడిషనల్ డీసీపీ ఎ.రమణా రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బండారు శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం
సమాచారం అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. వెంటనే గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనలో గాయపడి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి, కొడుకుకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని చెప్పారు.
– డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

