సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఫస్ట్ వాక్ మోడలింగ్ సంస్థ మాదాపూర్లోని ఎంబ్యాంకెట్ హాల్లో నిర్వహించిన ఫ్యాషన్ వాక్ ఆకట్టుకున్నది. మొదటి ఆడిషన్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మోడళ్లు ర్యాంప్ వాక్ చేశారు.
నిర్వాహకుడు సాయికుమార్ మాట్లాడుతూ.. 18 నుంచి 30 సంవత్సరాల యువతీ యువకులు ఈ ఫ్యాషన్ రంగంలోకి రావచ్చన్నారు. ఔత్సాహికుల కోసం తమ సంస్థ ద్వారా డిప్లొమా ఇన్ ష్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఫొటోగ్రఫీ, మోడలింగ్ తదితర కోర్సులను అందిస్తున్నామన్నాని తెలిపారు.