ఇంతలోనే ఆచూకీ.. అంతలోనే అదృశ్యం

సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): రియల్టర్ విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు గురూజీ అలియాస్ త్రిలోక్‌నాథ్ ఆచూకీ తెలుస్తున్నా.. చివరి క్షణంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. 10 రోజుల నుంచి దాగుడు మూతలు ఆడుతున్నాడు. త్రిలోక్నాథ్కు దక్షిణ భారతదేశంలో అధిక సంఖ్యలో అనుచరులు ఉండటంతో అతడికి రోజుకు ఒకరు ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. సైబరాబాద్ పోలీసులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పుణె, కేరళ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఆచూకీ దొరికిందని ఆశతో ఆ ప్రదేశానికి వెళ్లగానే.. అక్కడి నుంచి గురూజీ మాయమవుతున్నాడు. ఇలా ఒక చోటు మార్చిన తర్వాత త్రిలోక్‌నాథ్ ఇక ఆ ప్రాంతం నుంచి కమ్యూనికేషన్‌ను పూర్తిగా కట్ చేసుకుంటున్నాడని పోలీసులు గుర్తించారు. కారులోనే ప్రయాణిస్తూ.. ఆయా ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడని సమాచారం ఉంది. నాటు వైద్యంతో చాలా మందికి రోగాలను నయం చేశాడనే భావనను కల్పించడంతో అనుచరులు కూడా అతడికి పూర్తిగా సహకరిస్తూ.. పోలీసుల దృష్టిని మళ్లిస్తున్నారని తెలిసింది. ఎన్ని దాగుడు మూతలు ఆడినా త్రిలోక్నాథ్ను అతి త్వరలోనే పట్టుకుంటామని సైబరాబాద్ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fake baba
- Murder Case
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

