ఫేస్బుక్ పరిచయం.. రూ. 2.28 లక్షలు బురిడీ

ఫేస్బుక్లో యువతి పేరుతో పరిచయం అయిన సైబర్‌చీటర్.. తార్నాకకు చెందిన 63 ఏండ్ల వృద్ధుడికి రూ. 2.28 లక్షలు టోకరా వేసింది. ఫేస్బుక్లో కరీంసహరా పేరుతో నగరానికి చెందిన ఓ వృద్ధుడికి సైబర్‌చీటర్ పరిచయం అయ్యింది. కొన్నాళ్లు ఇద్దరు చాటింగ్ చేసి.. స్నేహం పెంచుకున్నారు. ఈ క్రమంలో తాను హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతానని, తన వ్యాపారాలు మీరు చూసుకోవాలని చెప్పింది. వ్యాపారంలో పెట్టుబడులకు మీకు నగలు, డాలర్లను పంపిస్తున్నానని నమ్మించి.. అందుకు సంబంధించి ఫొటోలను వాట్సాప్‌లో పంపించింది. రెండు రోజులకు ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అంటూ ఆ వృద్ధుడికి ఫోన్ చేశారు. మీ పేరుతో పార్శిల్ వచ్చింది.. అందులో డాలర్లు, ఆభరణాలు ఉన్నాయి.. వాటికి ట్యాక్స్‌లు, జీఎస్టీ కట్టాలంటూ అతడి నుంచి మూడు దఫాలుగా రూ. 2.28 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోతున్నానని గుర్తించిన బాధితుడు బుధవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- facebook friendship
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

