మాదాపూర్ : ప్రభుత్వం 12 నుండి 14 ఏండ్ల లోపు బాల బాలికలకు టీకాలను అందించాలనే ఉద్ధేశ్యంతో పూర్తి స్థాయిలో టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీంతో బుధవారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక కార్పొరేటర్ వి. పూజిత గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్లతో కలిసి వాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ … కరోనా వంటి మహమ్మారిని తరిమికొట్టేందుకు టీకాలే శ్రీ రామ రక్ష అని, ప్రతి ఒకరు ఈ టీకాలను సద్వినియోగం చేసుకొని కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒకరు టీకాలను బాధ్యతగా వేయించుకొని కొవిడ్ నివారించడంలో ముందడుగు వేయాలని అన్నారు.
వాక్సినేషన్‌పై ప్రజలకు విసృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అరవింద్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘనాథ్‌రెడ్డి, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, యాదగిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.