హైదరాబాద్: నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో (Masab tank) భారీ ప్రమాదం తప్పింది. మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఓ ట్రావెల్స్ బస్సుపై విద్యుత్ స్తంభం పడింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సుపై విరిగిపడిన ఎలక్ట్రిక్ పోల్‌ను తొలగించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.