రవీంద్రభారతి, మే 7: ‘డ్రామా యాక్షన్ ఫర్ కిడ్స్’కు సంబంధించిన గోడ పత్రికను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రామా యాక్షన్ ఫర్ కిడ్స్ యాక్టింగ్ కార్యక్రమం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కోర్సులో చేరాలనుకునే వారు 7396817623 నంబర్లో సంప్రదించాలని నిర్వాహకుడు రమేశ్ కిషన్ గౌడ్ తెలిపారు.