మల్కాజిగిరి, అక్టోబర్ 20: బాధితుల దృష్టి మళ్లించిన దుండగులు వేర్వేరు చోట్ల రెండు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. పీవీఎన్ కాలనీకి చెందిన తేజ ఉదయం పాలు కొనడానికి దుకాణం వద్దకు వచ్చాడు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు యువకులు.. పాల దుకాణం వద్ద ఆగారు.
వారిలో ఓ యువకుడు పాల దుకాణం వద్ద డబ్బును కింద పడేశాడు. మీ డబ్బు కిందపడిపోయిందంటూ తేజతో చెప్పాడు. తేజ ఆ డబ్బును తీసుకోవడానికి కిందకు వంగడంతోనే.. అతడి జేబులో నుంచి సెల్‌ఫోన్ చోరీ చేశారు. తేజ వెంటనే అప్రమత్తమై దుండగుల్లో ఒకరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వచ్చిన ముగ్గురూ వాహనంపై పరారయ్యారు.
ఈస్ట్ ఆనంద్‌బాగ్‌కు చెందిన కుమార్ కూరగాయలు కొనడానికి వచ్చాడు. అతడి దృష్టి మళ్లించిన దుండగులు ముందు జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను కొట్టేశారు. గతనెల వేంకటేశ్వరనగర్కు చెందిన సోమనారాయణ సెల్‌ఫోన్ కూడా ఈ విధంగానే చోరీకి గురైంది. ముఖాలకు మాస్కులు ధరించి, తలకు హెల్మెట్ పెట్టుకొని నంబర్ ప్లేట్‌లేని వాహనంపై వస్తున్న దుండగులు ఈ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.