ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్
ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులలో రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం విజయవంతం కావడంతో గురువారం నుంచి టికెట్ జారీకి డిజిటల్ పేమెంట్
ఇక నుంచి నగదు రహితంగా టికెట్ జారీ
ఇప్పటికే 40 ఎయిర్‌పోర్టు బస్సులలో ప్రారంభమైన డిజిటల్ పేమెంట్లు
అన్ని సిటీ బస్సులు, జిల్లా సర్వీసులకు విస్తరణకు ఆర్టీసీ చర్యలు
సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులలో రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం విజయవంతం కావడంతో గురువారం నుంచి టికెట్ జారీకి డిజిటల్ పేమెంట్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని మార్గాలలో నడుస్తున్న దాదాపు 40 ఎయిర్‌పోర్టు బస్సులలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు పరుస్తున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ఆర్ఎం వెంకన్న ధ్రువీకరించారు.
డిజిటల్ పేమెంట్ విధానం ద్వారా టికెట్ జారీ చేయడానికి కస్టమర్, స్కానింగ్, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ సేవలు, స్వైపింగ్ వంటి అన్ని రకాల పద్ధతుల్లో వినియోగించవచ్చు. ఇందుకోసం తీసుకువచ్చిన ఐటిమ్స్ మిషన్లకు ఇంటర్నెట్ సదుపాయం, డేటా లేకపోయినప్పటికీ టికెట్ బుకింగ్‌కు ఈ యంత్రం పని చేస్తుందన్నారు. అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత డిజిటల్ పేమెంట్ విధానంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులలో అమలు పరుస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే అన్ని సిటీ, జిల్లా బస్సులలో అమలు..
నగరంలో ఉన్న అన్ని రకాల సిటీ బస్సులలో కూడా వీలైనంత త్వరలోనే ఐటిమ్స్ మిషన్ల ద్వారా డిజిటల్, యూపీఐ ద్వారా టికెట్ జారీకి చెల్లింపు ప్రక్రియ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టారు. నగరంలోని ఆర్డినరీ సిటీ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్‌లలో కూడా ఈ విధానం అమలు పరుస్తామన్నారు. దాదాపు వచ్చే రెండు నెలల్లోనే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని విస్తరించడానికి ఉన్నతాధికారులు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ అధికారులు అభిప్రాయపడ్డారు. అనంతరం దశల వారీగా జిల్లాతో పాటు ఇతర రాష్ర్టాలకు వెళ్లే బస్సులు, ఏసీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, రాజధాని, గరుడ, లగ్జరీ వంటి వాటిలో కూడా ఈ విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ విధానం పూర్తిగా అమల్లోకి రావడం వల్ల ప్రయాణికులు, టికెట్ జారీ క్రమంలో కండక్టర్లకు ఇప్పటికే తలెత్తే చిల్లర సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం బస్పాసుల జారీకి ఆయా కేంద్రాలలో డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులో ఉందని, దాని వల్ల ప్రయాణికులకు డబ్బుల చెల్లింపుల ప్రక్రియ సులభమైందని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

