సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రక్షణ శాఖకు అవసరమైన పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్‌లో(T-Hub) డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్‌ను నిర్వహి స్తున్నామని టీహబ్ ప్రతినిధి తెలిపారు. వివిధ రంగాలకు అవసరమైన ఆవిష్కరణలను చేస్తున్న స్టార్టప్‌ల నిర్వాహకులు దేశ రక్షణలో కీలకంగా ఉన్న రక్షణ శాఖ కోసం తమ స్టార్టప్‌లను ప్రారంభిం చాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుందన్నారు.
ఔత్సాహికులు ఈ చాలెంజ్‌లో పాల్గొన వచ్చని తెలిపారు. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, మరిన్ని వివరాలకు టీ హబ్ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్, డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్‌తో కలిసి టీహబ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని తెలిపారు.