సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా అక్రమంగా ఔషదాలను నిలువ ఉంచిన గోదాంపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్టేష్రన్ అధికారులు దాడులు జరిపారు.ఈ దాడుల్లో రూ.6.70లక్షల విలువ చేసే ఔషదాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిల్లో 6రకాల గడువు తీరిన ఔషధాలు, అబార్షన్ కిట్స్ తదితర ఔషధాలు ఉన్నట్లు డీసీఏ అధికారులు తెలిపారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…ఉప్పల్‌లోని ఖల్సా గ్రామం, లక్షీనారాయణ కాలనీకి చెందిన అడ్డంకి వెంకటసురేష్ బాబు తన నివాసంలో ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ఔషధాలను నిలువ ఉంచాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు అక్రమ ఔషద గోదాంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.6.70లక్షల విలువ చేసే ఔషదాలు సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడికి నోటీసులు పంపారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంజుమ్ అబిదా, డ్రగ్ ఇన్స్పెక్టర్లు డా.బి.లక్షీనారాయణ, బి.ప్రవీణ్, పి.అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.