సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): గత మూడు రోజులగా గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనం ఉష్ణతాపానికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29 డి గ్రీలు, గాలిలో తేమ 50శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.