సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : యువతను పెడదోవ పట్టిస్తున్న డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నివారించేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో గురువారం ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు చేపట్టే ముఠాలపై ఈ సెల్ నిఘా ఉంచి అరెస్టు చేస్తుంది. ఈ సెల్‌కు ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్‌ను నియమించగా, డీసీపీ (క్రైమ్స్) రోహిణి ప్రియదర్శిని పర్యవేక్షిస్తారు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే సైబరాబాద్ నార్కోటిక్స్ కంట్రోల్ రూం సెల్ నంబర్ 7901105423 లేదా 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు సమాచారమివ్వాలని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కోరారు. కాగా, గురువారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 13 మంది గంజాయి విక్రేతలను అరెస్టు చేసి, 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.