ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

తెలంగాణలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల వసతీగృహంలో చదువుకునే గిరిజన విద్యార్థుల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్ఫూర్తిని నింపారు. గురుకుల వసతీగృహంలో చదువుకునే విద్యార్థులు ఇటీవల కాలంలో గోల్ఫ్ క్రీడలో రాణిస్తున్నారు. వారిలో కొందరు సైబరాబాద్ పరిధిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల వసతీగృహంలో 8వ తరగతి చదువుకుంటున్నారు. వీరు ఈ మధ్య జరిగిన మ్యాచ్లో విజయం సాధించి శుభాంకర్ శర్మ ట్రోఫీని గెలుచుకున్నారు. అంతేకాదు వచ్చేవారం కోయంబత్తూర్లో జరగనున్న సౌత్ గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులను శనివారం కలిసిన స్టీఫెన్ రవీంద్ర వారికి అభినందనలు తెలిపారు. గెలుపోటములను సమానంగా తీసుకోవడం అలవరచుకోవాలని సూచించారు.
గెలుపోటములను సమానంగా తీసుకోవడం అలవరచుకోవాలని విద్యార్థులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లాలని.. అప్పుడే తెలంగాణకు, దేశానికి గర్వకారణంగా నిలుస్తారని విద్యార్థులను మోటివేట్ చేశారు. ఎప్పుడూ తన సహాయసహకారాలు ఉంటాయని ధైర్యాన్నిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

