మీ పిల్లలు.. మా బాధ్యత

- కరోనా బారిన పడిన కుటుంబాలకు ఆసరా
- పిల్లల సంరక్షణకు ముందుకొచ్చిన సైబరాబాద్ పోలీసు
- చైల్డ్ వెల్ఫేర్ కేంద్రాల ఏర్పాటు..08045811215 నంబర్‌ను సంప్రదించాలి
కరోనా బారిన పడిన వారికి ఏదోరకంగా సైబరాబాద్ పోలీస్ అండగా ఉంటోంది. తాజాగా కరోనా సోకిన భార్యాభర్తలు ఆస్ప త్రి లేదా ఐసోలేషన్‌లో ఉంటే వారి పిల్లలు సంరక్షణకు ముందుకొచ్చింది. సైబరాబాద్ పోలీసు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్తగా ఏర్పాటు చేసిన చైల్డ్‌కేర్ రెస్పాన్స్ కేంద్రాన్ని రెండు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ బుధవారం ప్రారంభించారు. ఒంటరి కుటుంబాలకు చెందిన దంపతులు కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో ఉంటే వారు తమ పిల్లల సంరక్షణ కోసం 08045811215 నంబర్‌ను సంప్రదిస్తే షీటీమ్స్ తగిన చర్యలు తీసుకొని పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటుందన్నారు. ఈ విధంగా పిల్లలను చూసుకునేందుకు ఎవరు ముందుకొచ్చినా వారి ద్వారా కేంద్రాలను నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధం గా ఉన్నారని, వీటి నిర్వహణ బాధ్యతను సైబరాబాద్ షీ టీమ్స్ పర్యవేక్షిస్తుందని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఎస్సీఎస్సీ ఉమెన్ ఫోరం సంయుక్త కార్యదర్శి ప్రత్యూష, నేహరీచా అరియా, సుమారావు, మృదులా, వాణీ, లావన్య, చందన, వై.పల్లవ, దీప్, షీ టీమ్స్ డీసీపీ అనసూయలను సీపీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల పాల్గొన్నారు.
చైల్డ్‌కేర్ రెస్పాన్స్ కేంద్రం నిర్వహించాలంటే..
- పిల్లలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించాలి.
- పిల్లలు, వారి తల్లిదండ్రులకు మానసిక రక్షణ కల్పించాలి.
- పిల్లలకు అవసరమయ్యే ప్రాథమిక అవసరాలు ఉండాలి.
- స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి.
- ఐసోలేషన్‌లో ఉండే తల్లిదండ్రులతో మాట్లాడేందుకు,చూసేందుకు ఏర్పాట్లు చేయాలి.
- ఈ కేంద్రాలు దవాఖానలు, వైద్యులతో ఒప్పందం కుదుర్చుకోవాలి.
- ఈ వసతులు కలిగిన చైల్డ్‌కేర్ కేంద్రాలు, చైల్డ్ కేర్‌టేకర్స్ covid.scsc.in లో దరఖాస్తు చేసుకోవాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

