హైదరాబాద్: హవాలా మనీ కేసులో (Hawala Money) సైబరాబాద్ సీపీ గన్‌మెన్ అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కుతుబుద్దీన్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శేఖర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. నగర శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో కర్ణాటకకు చెందిన నలుగురితో మొయినాబాద్ వాసులు హవాలా డీల్ కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న శేఖర్.. వారిని బెదిరించి రూ.25 లక్షలు కాజేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కానిస్టేబుల్ శేఖర్‌ను అరెస్టుచేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయమై ఆరాతీస్తున్నారు.