సుల్తాన్‌బజార్, జూన్ 30: ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని సీపీ అంజనీకుమార్ అన్నారు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ రాష్ట్రంలోనే నాలుగో ఉత్తమ స్టేషన్‌గా ఎంపికైన నేపథ్యంలో బుధవారం ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్యంలో ఆత్మీయ అనుబంధ సమావేశం జరిగింది. సీపీ అంజనీకుమార్ అదనపు పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, సంయుక్త కమిషనర్ రమేశ్‌రెడ్డి, డీసీపీలు మురళీధర్, చక్రవర్తి, ఏసీపీలు దేవేందర్, పి. జ్ఞానేందర్‌రెడ్డి, గోవర్థన్రెడ్డిలతో కలిసి హాజరయ్యారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, ఎస్సైలు సైదులు, బాల స్వామి, అనిల్‌కుమార్, మాన్సింగ్, ఏఎస్సై కిశోర్‌తో పాటు హెడ్‌కానిస్టేబుల్, ఇతర సిబ్బందికి జ్ఞాపికలను అందజేసిన సీపీ..వారిని అభినంధించారు.