e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ 3 రోజులు..30 కేంద్రాలు.. 3 లక్షల మంది

3 రోజులు..30 కేంద్రాలు.. 3 లక్షల మంది

3 రోజులు..30 కేంద్రాలు.. 3 లక్షల మంది
 • కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళిక
 • ప్రజలతో మమేకమై ఉండే వారందరికీ వ్యాక్సిన్‌
 • గ్రేటర్‌ పరిధిలో 3 లక్షలకుపైగా గుర్తింపు
 • రేపటి నుంచి టీకాలు పంపిణీ
 • మూడ్రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు
 • 30 సర్కిళ్లలో 30 ప్రత్యేక కేంద్రాలు
 • ఏర్పాట్లు పూర్తి చేసిన జీహెచ్‌ఎంసీ

వ్యాధి వస్తే దాన్ని పరిశీలించి అప్పటికప్పుడు నయం చేసే వాడు నిపుణుడు. కానీ.. అదే వ్యాధికి మూలాన్ని వెతికి మళ్లీ రాకుండా చేసే వాడు నిజమైన వైద్యుడు. కరోనా మహమ్మారి కట్టడి విషయంలో అందరూ నిపుణుల్లా ఆలోచిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం డాక్టర్‌లా ఆలోచించింది. ఎప్పటికప్పుడు కొవిడ్‌ను కట్టడి చేయడమే కాదు.. మున్ముందు రోజుల్లో అది విస్తరించకుండా ఉండేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది.

వారంతా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ఉంటారు. నిత్యం ప్రజలకు అవసరమైన అన్ని రకాల అవసరాలు తీర్చేది వాళ్లే. ఉదయం లేచింది మొదలు.. తినే తిండి నుండి నడిచే బండి వరకు ఏ అవసరం తీరాలన్నా వారు చేసి పెట్టాల్సిందే. అలా వివిధ విభాగాల్లో పనిచేసే 3 లక్షల మంది నిత్య సేవలకుతోనే కరోనా నియంత్రణాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ప్రజల నిత్యావసరాలను తీర్చే వారికి ముందస్తుగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించడంవల్ల గ్రేటర్‌ మొత్తాన్ని రక్షణ ఛత్రం కిందకుతీసుకువచ్చేలా ఏర్పాట్లు చేపట్టింది.

ఎవరెవరికి ఇస్తారంటే..

 • జర్నలిస్టులు (ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌)
 • రేషన్‌ డీలర్లు చౌకధరల డీలర్లు, విత్తన డీలర్లు
 • గ్యాస్‌ డెలివరీ సిబ్బంది
 • పెట్రోల్‌ బంక్‌ కార్మికులు
 • ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు
 • సెలూన్లలో పనిచేసే సిబ్బంది
 • కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ల విక్రేతలు
 • మాంసాహారం, చేపల విక్రేతలు
 • మద్యం దుకాణాల్లోని సిబ్బంది
 • సర్కిళ్ల వారీగా టీకా కేంద్రాలివే..
 • కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాల (కాప్రా సర్కిల్‌)
 • రామంతాపూర్‌ ఫంక్షన్‌ హాల్‌ (ఉప్పల్‌)
 • కేబీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ మన్సూరాబాద్‌ (హయత్‌నగర్‌)
 • వనస్థలిపురం హుడా కమ్యూనిటీ హాల్‌, మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ చంపాపేట (ఎల్బీనగర్‌)
 • గణేశ్‌ ఫంక్షన్‌ హాల్‌ రాజధాని థియేటర్‌ పక్కన (సరూర్‌నగర్‌)
 • ముంతాజ్‌ కాలేజీ అక్బర్‌బాగ్‌ (మలక్‌పేట)
 • మిత్ర స్పోర్ట్స్‌ క్లబ్‌, గౌలిపుర, ఎన్‌ఆర్‌టీ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌, రెయిన్‌ బజార్‌ (సంతోష్‌నగర్‌)
 • సుహాన ఫంక్షన్‌ హాల్‌, తాళ్లకుంట రోడ్‌ (చాంద్రాయణగుట్ట)
 • సన గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ (చార్మినార్‌)
 • కుడా పాలిటెక్నిక్‌ కాలేజీ, రసూల్‌పుర (ఫలక్‌నుమా)
 • ఎస్‌ఎన్‌సి కన్వెన్షన్‌ హాల్‌, శివరాంపల్లి (రాజేంద్రనగర్‌)
 • ఎంపీ గార్డెన్‌ (మెహిదీపట్నం)
 • ఇంపీరియల్‌ గార్డెన్‌, టౌలిచౌకీ (కార్వాన్‌)
 • రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాల్‌ (గోషామహల్‌)
 • ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల (ముషీరాబాద్‌)
 • అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియం (అంబర్‌పేట)
 • సనత్‌నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ (ఖైరతాబాద్‌)
 • బంజారా గార్డెన్‌ ఫంక్షన్‌ లేక్‌ వ్యూ (జూబ్లీహిల్స్‌)
 • మహమూద్‌ ప్యారడైజ్‌ ఫంక్షన్‌హాల్‌ (యూసుఫ్‌గూడ)
 • గచ్చిబౌలి స్టేడియం (శేరిలింగంపల్లి)
 • చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియం (చందానగర్‌)
 • చైతన్యనగర్‌, పటాన్‌చెరు మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ మాల్‌ (పటాన్‌చెరు)
 • మూసాపేట వై జంక్షన్‌ ఎన్‌కేఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ (మూసాపేట)
 • నైనాగార్డెన్‌ (కూకట్‌పల్లి)
 • సరోజిని గార్డెన్‌, జీడిమెట్ల (కుత్బుల్లాపూర్‌)
 • మహారాజ గార్డెన్స్‌, చిత్తారమ్మ టెంపుల్‌ (గాజులరామారం)
 • ఓల్డ్‌ అల్వాల్‌ వీబీఆర్‌ గార్డెన్‌ (అల్వాల్‌)
 • మల్కాజిగిరి క్రాస్‌రోడ్‌ జడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ హైస్కూల్‌ (మల్కాజిగిరి)
 • సీతాఫల్‌మండి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ (సికింద్రాబాద్‌)
 • బన్సీలాల్‌పేట మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ (బేగంపేట)

ఉదయం 10 నుంచి 4 గంటల వరకు..

ప్రభుత్వం గుర్తించిన వారందరికీ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేయనున్నట్లు హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్‌ శ్వేతామహంతి తెలిపారు. టీకాలు తీసుకునే వారు ఆధార్‌ కార్డులతో పాటు గుర్తింపు కార్డులను తీసుకు రావాలన్నారు. నిత్య సేవకులందరికీ కరోనా వ్యాక్సిన్‌ గ్రేటర్‌ జనాభా కోటిపైనే. వారందరి రోజువారీ అవసరాలైన రేషన్‌, కూరగాయలు, ఇంధనం, రవాణా, సమాచార వ్యవస్థ వంటి వాటిని అందజేస్తున్నది మాత్రం 3 లక్షల మంది. అలాంటి వారు ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉంటారు. ఒకవేళ వీళ్లు వైరస్‌ బారిన పడితే.. ఇతరులకూ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ.

అందువల్లే ఈ 3 లక్షల మందికి యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్‌ వేయించడం ద్వారా భవిష్యత్తులో కరోనాను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించిన ప్రభుత్వం… వారికి కూడా వాక్సిన్స్‌ వేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖతో కలిసి జీహెచ్‌ఎంసీ 30 సర్కిళ్లలో 30 వ్యాక్సిన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. అదనపు కమిషనర్ల పర్యవేక్షణలో జోనల్‌ ఆఫీసర్లు కేటగిరీల వారీగా టోకెన్లు ఇచ్చి టీకాలు ఇవ్వనున్నారు. ఈనెల 28,29,30 తేదీల్లో గ్రేటర్‌లో ఉన్న ఈ విభాగాల వారందరికీ టీకా ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల వారీగా ఒకేచోట వ్యాక్సిన్‌ వేసేలా ఆర్టీఏ, వైద్య, ట్రాఫిక్‌ విభాగాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
3 రోజులు..30 కేంద్రాలు.. 3 లక్షల మంది

ట్రెండింగ్‌

Advertisement