మల్కాజిగిరి, ఏప్రిల్ 26 : రెండోదశ కరోనా పంజా విసురుతుండడంతో నగరవాసులు అప్రమత్తమయ్యారు. చాలావరకు మాస్క్‌లు ధరించడంతోపాటు సమూహాల్లో తిరగడం తగ్గింది. వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఇండ్లళ్లకు రాకపోకలు తగ్గాయి. కరోనా నేపథ్యంలో ‘మా ఇంటికి ఎవరూ రాకండి.. మీ ఇంటికి ఎవరినీ రానివ్వకండి.. అత్యవసరమైతే ఫోన్ చేయండి’ అని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన మల్లికార్జునశర్మ ఇంటి గేట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్ఫూర్తి నింపుతున్నది.