దక్షిణ డిస్కంలో అవినీతి దందా.. రైతుల పేరిట డీటీఆర్ ఖర్చులు స్వాహా
ఎల్‌నినో కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాటు విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడంతో విద్యుత్ సంస్థల అధికారులకు కరెంట్ సరఫరా చాలా కష్టంగా మారుతోంది. ఒకవైపు కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు డీటీఆర్‌ల రిపేర్లతో కరెంట్సరఫరా నిలిచిపోతున్నది.
- ఐదు నెలల్లో 30వేల ట్రాన్స్ఫార్మర్లు రిపేరుకు..
- సగటున ఒక్కో డీటీఆర్‌కు రూ.15వేల ఖర్చు
- పెట్టుబడి రైతులది.. దోపిడీ సిబ్బందిది..
- జేబులు గుల్ల చేసుకుంటున్న అన్నదాతలు
సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : ఎల్‌నినో కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాటు విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడంతో విద్యుత్ సంస్థల అధికారులకు కరెంట్ సరఫరా చాలా కష్టంగా మారుతోంది. ఒకవైపు కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు డీటీఆర్‌ల రిపేర్లతో కరెంట్సరఫరా నిలిచిపోతున్నది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో అన్ని సర్కిళ్లలో వేలాది ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ సెంటర్లకు చేరుకుంటున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కం పరిధిలో 47వేల ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు కేంద్రాలకు చేరుకుంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఐదు నెలల్లో 30,545 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. ఏదైనా ట్రాన్స్ఫార్మర్ పాడైతే 24 నుంచి 48 గంటల్లో దాని స్థానంలో మరొక డీటీఆర్‌ను అమర్చడం కానీ, పాడైన డీటీఆర్‌ను రిపేర్ చేసి ఇవ్వడం కానీ చేయాలి. కానీ టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఏ ఒక్క సెక్షన్‌లోను ఇది అమలు కావడం లేదు. దక్షిణ డిస్కం పరిధిలో ప్రతి కేంద్రంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రిపేరింగ్ కేంద్రాల్లో రోలింగ్ స్టాక్ లేకపోవడంతో ఒక్కో రైతు వారం పదిరోజులు నిరీక్షించాల్సి వస్తోంది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు డీటీఆర్లను బాగు చేయించడానికి సొంతంగా ఖర్చులు పెట్టుకుని రిపేర్లు చేయిస్తున్నారు. అయితే ఈ రిపేర్ల విషయానికొస్తే మొత్తం ఖర్చు భరించాల్సిన డిస్కంలోని సెక్షన్ల సిబ్బంది రైతుల పేరుతో స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 21 సర్కిళ్లు ఉండగా, వీటి పరిధిలో 150 సెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌ల రిపేర్లు… ఇలా 61 రకాల నిర్వహణ పనులకోసం ఒక్కో సెక్షన్‌కు ఏటా టీఅండ్ఎం(ట్రాన్స్పోర్ట్ అండ్ మేనేజ్మెంట్)కింద రూ.1.70కోట్ల వరకు నిధులు ఇస్తుంది.
కేవలం నిర్వహణ పనుల కోసమే డిస్కం ఏటా రూ.225 కోట్లు ఖర్చు చేస్తున్నది. పర్చేజ్ అండ్ మేనేజ్మెంట్(పీఅండ్ఎం), టీ అండ్ఎం కింద పాడైన డీటీఆర్, స్తంభాలు, లైన్లు ఎత్తేందుకు అవసరమైన క్రేన్లు, ట్రాన్స్‌పోర్టు వాహనాలు సమకూర్చారు. గ్రేటర్ హైదరాబాద్ సర్కిళ్ల పరిధిలో మినహా ఇతర ప్రాంతాల్లో ఇవి పనిచేస్తున్న దాఖలాలే లేవు. లైన్మెన్ డీటీఆర్‌కు ఉన్న మెయిన్ లైన్ కనెక్షన్ తొలగించిన తర్వాత రైతులే స్వయంగా ఆయా డీటీఆర్లను ట్రాక్టర్లో వేసుకుని 20 నుంచి 30 కి.మీ.ల దూరంలో ఉన్న రిపేరింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే నిజానికి ఆయా సర్కిళ్ల పరిధిలోని రిపేరింగ్ కేంద్రాల్లో 2 నుంచి 3శాతం రోలింగ్ స్టాక్‌ను మెయింటేన్ చేయాలి.
మెజార్టీ రిపేరింగ్ కేంద్రాల్లో ఇది జరగడం లేదు. దీంతో రైతులు వెంట తెచ్చిన డీటీఆర్ రిపేర్ కోసం వారం నుంచి పదిరోజుల పాటు అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. పొలంలోని దిమ్మెపై నుంచి డీటీఆర్‌ను ట్రాక్టర్లోకి ఎత్తినందుకు కూలీ రూ.2వేలు, ట్రాన్స్‌పోర్టుకు రూ.5వేలు, రిపేరింగ్ కేంద్రంలో దించి, రిపేర్ చేసి ఇచ్చినందుకు రూ.3వేలు, రైతుల తిండితిప్పలు, ఇతర ఖర్చులు ఇలా ఒక్కో డీటీఆర్ రిపేరుకు రూ.15వేల వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చులను డీటీఆర్ పరిధిలో ఉన్న నలుగురైదుగురు రైతులు వాటాలు వేసుకోవలసి వస్తున్నది.వాస్తవానికి డీటీఆర్ రవాణా ఖర్చులను కిలోమీటర్ చొప్పున లెక్కించి రైతులకు తిరిగి ఇవ్వాలి. కానీ ఏ ఒక్క సెక్షన్‌లోనూ ఇది జరగడం లేదు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రైతులకు ఇచ్చినట్లు రికార్డులు చూపించి స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.
పేలిపోతున్నాయి.. కాలిపోతున్నాయి
భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న సమయంలో డీటీఆర్లపై ఉన్న కొన్ని మోటార్లు ఆఫ్‌లో ఉంటాయి. దీంతో ఆ డీటీఆర్లపై లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. ప్రస్తుతం భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు మోటార్లను ఆన్‌చేసి ఉంచుతున్నారు. దీంతో లోడు కారణంగా డీటీఆర్లపై తరచూ ప్యూజు కొట్టేస్తుంది. ఏదైనా లూజ్ కాంటాక్టుల వద్ద స్పార్క్‌లు తలెత్తినప్పుడు ఆ మంటలు ఆయిల్‌పై పడి డీటీఆర్లు పేలిపోతున్నాయి.
ఎస్పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ 30వరకు ఫెయిలైన డీటీఆర్‌ల సంఖ్య సర్కిళ్ల వారీగా చూస్తే మేడ్చల్ 354, హబ్సిగూడ 357, సైబర్ సిటీ 710, రాజేంద్రనగర్ 1758,సరూర్ నగర్ 630, బంజారాహిల్స్ 137, సికింద్రాబాద్ 139, హైదరాబాద్ సౌత్ 195, హైదరాబాద్ సెంట్రల్ 130, సంగారెడ్డి 2359, మెడక్ 1941, సిద్దిపేట్ 1729, మహబూబ్‌నగర్ 1858, నారాయణపేట్ 1293, నాగర్‌కర్నూల్ 3410, వనపర్తి 971, గద్వాల్ 1015, నల్గొండ 4853, యాదాద్రి 1972, సూర్యాపేట 2859, వికారాబాద్ 1820 ఉన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

