ఐతారం..మేం మారం!

- కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. మారని జనం
- ఆదివారం అయితే మార్కెట్లకు పోటెత్తుతున్న వైనం
- కొవిడ్ నిబంధనలు పాటించకుండా కొనుగోళ్లు
- చేపలు, మటన్, చికెన్ షాపుల వద్ద గుంపులు గుంపులుగా..
- ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీద జనసంచారం
- ఆదివారం రోడ్డుమీదకు వచ్చినవారిని బేగంపేట పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లోకి పంపిన పోలీసులు
సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రజల ప్రాణాలే లక్ష్యంగా.. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే… కొందరు తమకేమీ పట్టనట్లుగా వ్యవరిస్తున్నారు. బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు.. ఉదయం 10 గంటల తర్వాత కూడా ఇష్టానుసారంగా రోడ్డెక్కుతున్నారు.. కనీసం కొవిడ్ నిబంధనలు కూడా పాటించడంలేదు..ఆదివారం అయితే చెప్పనక్కరలేదు.. గుంపులు గుంపులుగా చేరి మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా చేపలు, మటన్, చికెన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది.. కొనుగోలు సమయంలో కొందరు మాస్కులు కూడా ధరించడంలేదు..భౌతిక దూరం కూడా పాటించడంలేదు.. ఇలా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏ మార్కెట్ల వద్ద చూసినా ఆదివారం గుంపులుగా కనిపించడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు ఇలా ప్రజలు మార్కెట్లలో తమకేమీ పట్టనట్లుగా వ్యవరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం వస్తే అంతేనా..?
ఆదివారం వచ్చిదంటే చాలు ప్రధాన రహదారులు మినహాయిస్తే.. కాలనీలు, బస్తీలు, అంతర్గత రహదారులు కొనుగోళ్లతో సందడిగా మారుతున్నాయి.. లాక్డౌన్ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే షాపింగ్ చేసేందుకు అవకాశం ఉండటంతో ఒక్కసారిగా అందరూ కొనుగోళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. ఆదివారం అయితే చేపల మార్కెట్లతో పాటు చికెన్, మటన్‌షాపులు కిక్కిరిసిపోతున్నాయి. కొనుగోలు సమయంలో కొందరికి కొవిడ్ నిబంధనలు పాటించాలన్న ధ్యాస కూడా ఉండటంలేదు. ఇది చాలా ఆందోళనకర పరిణామంగా ప్రభుత్వం భావిస్తోంది. నాన్‌వెజ్ ఆదివారం కాకుండా ఇతర రోజుల్లోనూ దొరికే అవకాశం ఉన్నా, కేవలం ఆదివారం మాత్రమే వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతూ కరోనా వ్యాప్తికి ఆజ్యంపోస్తున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా నగర వాసుల్లో మార్పు వచ్చి.. గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.
మారని జనం..
- లాక్డౌన్ సమయంలో ఎవరైనా రోడ్ల మీదకు వస్తే.. పోలీసులు వారికి చలాన్లు విధించి.. కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.
- అయినా నగరవాసులు అవేమి పట్టించుకోకుండా ఉదయం 10 గంటల తర్వాత యథేచ్ఛగా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.
- ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత బేగంపేట ప్రధాన రహదారిలో చెక్‌పోస్టుల వద్ద.. రోడ్డుమీదకు వచ్చిన వారిని నేరుగా బేగంపేట పబ్లిక్ స్కూల్ మైదానంలోకి పంపించారు.
- ఇదే పరిస్థితి గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల ఉందని పోలీసులు వాపోతున్నారు.
- లాక్డౌన్ సమయంలో నగర వాసులను ఎంత కట్టడి చేసినా వారు మారడం లేదని, వారిలో మార్పు వస్తేనే లాక్డౌన్ లక్ష్యం నేరవేరుతుంది.
- లేదంటే దానికి అర్థం లేకుండా పోతుందనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగరవాసులు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ, కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతతో వ్యవహరిస్తే కలిసికట్టుగా దాన్ని అంతమొందించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- corona spread
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

