బిల్లులు చెల్లించాలని రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
పార్లమెంట్ ఎన్నికల సమయంలో వివిధ ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తున్నది. అప్పులు చేసి మరీ పోలింగ్ సిబ్బంది మొదలు, పోలీస్ సిబ్బంది వరకు ఆహారం, టెంట్లు, టేబుళ్లు, స్టేషనరీ, చివరకు వీడియోగ్రఫీ సైతం ఏర్పాట్లు చేశారు. ఇలా అధికారులు ఏది చెబితే అది సమకూర్చి.. వారు చెప్పిందల్లా చేసిన కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు.
- హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
- పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లకు లక్షలు ఖర్చు
- బిల్లులు రాక తలలు పట్టుకున్న కాంట్రాక్టర్లు
ఖైరతాబాద్, జూలై 18: పార్లమెంట్ ఎన్నికల సమయంలో వివిధ ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లక్షలు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తున్నది. అప్పులు చేసి మరీ పోలింగ్ సిబ్బంది మొదలు, పోలీస్ సిబ్బంది వరకు ఆహారం, టెంట్లు, టేబుళ్లు, స్టేషనరీ, చివరకు వీడియోగ్రఫీ సైతం ఏర్పాట్లు చేశారు. ఇలా అధికారులు ఏది చెబితే అది సమకూర్చి.. వారు చెప్పిందల్లా చేసిన కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ పూర్తి కాగానే బిల్లు విడుదలవుతాయని, తమ కష్టాలు తీరుతాయని నమ్మి ఉన్నదంతా ఊడ్చి పెట్టారు. ఎన్నికల కోడ్ ముగిసి నెల రోజులు దాటినా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. అధికారుల ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరగా రోడ్డెక్కారు. గత శాసనసభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు సగం మందికి మాత్రమే చెల్లించారని, మిగతా వారికి ఇంకా చెల్లించలేదని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు రూపాయి కూడా చెల్లించడంలేదని వాపోతున్నారు.
పలువురు అధికారులకు వినతులు
తమ బిల్లులు చెల్లించాలంటూ గురువారం కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. లక్డీకాపూల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల కమిషన్ డబ్బులు విడుదల చేశామని చెబుతున్నా.. అధికారులు మాత్రం బిల్లులు చెల్లించడంలేదని వాపోయారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషనర్ కార్యాలయాలతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిసి వినతిపత్రాలు సమర్పించామని కాంట్రాక్టర్లు సాయినాథ్, నరేశ్, రాజు, అబ్దుల్ నదీమ్, శరత్, వెంకటేశ్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

