Hyderabad | మధురానగర్ పీఎస్‌లో డీసీపీపై తిరగబడ్డ కానిస్టేబుల్
Hyderabad | తనను తిట్టాడనే ఆగ్రహంతో పై అధికారి అని కూడా చూడకుండా ఏకంగా డీపీసీపైనే తిరగబడ్డాడు ఓ కానిస్టేబుల్. ఆరేయ్ నువ్వే యూజ్లెస్ ఫెల్లోరా అంటూ కోపంతో ఊగిపోయాడు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
Hyderabad | తనను తిట్టాడనే ఆగ్రహంతో పై అధికారి అని కూడా చూడకుండా ఏకంగా డీపీసీపైనే తిరగబడ్డాడు ఓ కానిస్టేబుల్. ఆరేయ్ నువ్వే యూజ్లెస్ ఫెల్లోరా అంటూ కోపంతో ఊగిపోయాడు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మధురానగర్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ రోల్‌కాల్ ఉదయం 10.30 గంటలకు ఉంటుందని స్టేషన్ సిబ్బందికి ఉదయం 9.19 నిమిషాలకు మేసేజ్ పంపించారు. ఈ రోల్‌కాల్‌కు పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ డి.తిరుపాల్ నాయక్ ఆలస్యంగా వచ్చాడు. దీంతో డీసీపీ విజయ్‌కుమార్ ‘యూజ్ లెస్ ఫెలో.. డ్యూటీ ఇలాగేనా చేసేది.. పోలీస్ డ్యూటీ అనుకున్నావా.. గొడ్లు కాసే పని అనుకున్నావా.. ఇంతసేపు ఎక్కడికి పోయావు.. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నావుగా.. డ్యూటీ సరిగా చేయవా?’ అంటూ తిరుపాల్ నాయక్‌ను తిట్టాడు.
తనను తిట్టడంతో ఆగ్రహించిన తిరుపాల్ నాయక్ ‘అరేయ్ నువ్వే యూజ్ లెస్ ఫెలోరా.. ఎన్ని మాటలు అంటావురా నన్ను.. బయట పనిచేస్తే ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుందిరా.. నా భార్యకు డెలివరీ అయితే ఉండాల్సి వచ్చిందిరా.. నా భార్యను నేను కాకుంటే ఎవరు చూసుకుంటార్రా.. ఇచ్చే జీతం కంటే పనెక్కువ చేయించుకుంటున్నావురా’ అని అంటూ డీసీపీ విజయ్‌కుమార్‌పై తిరగబడ్డాడు.
డీసీపీపై తిరగబడ్డ కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాగా, మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాల నుంచి పోలీసుల వసూళ్లపై ఆరా తీసేందుకు డీసీపీ రోల్‌కాల్ పెట్టినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

