మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2009లో 14ఎఫ్‌ను రద్దు చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంపై అప్పటి కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన త్యాగం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయ్యిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు జంగయ్య, శ్రీకాంత్, నాగేందర్రావు, రాకేశ్, శరత్, శ్రీనిధి, ప్రణతి తదితరులు పాల్గొన్నారు.
– ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 1