Constable | జిమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిన కానిస్టేబుల్.. కార్డియాక్ అరెస్ట్‌తో మృతి
Constable | హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. జిమ్‌లో హుషారుగా వ్యాయామం చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే కన్నుమూశాడు.
Constable | హైదరాబాద్: హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. జిమ్‌లో హుషారుగా వ్యాయామం చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే కన్నుమూశాడు. నగరంలోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నర్వహిస్తున్న విశాల్.. రోజూలానే శుక్రవారం ఉదయం బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లారు. వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని సహచరులు వచ్చి చూసేలోపే మృతిచెందాడు. అయితే ఆయనను దవాఖానకు తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు.

కాగా, గురువారం నగరంలో జరిగిన ఓ వివాహ వేడుకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. పెండ్లి వేడుకకు హాజరైన రబ్బాని అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన బంధువులు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించిన అనంతరం పలువురు ఇలానే హార్డ్ స్ట్రోక్‌తో కన్నుమూస్తున్న విషయం తెలిసిందే.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (46) కూడా తన ఇంట్లోని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ కన్నుమూశారు. గతేడాది అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలారు. దీంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయిన విషయం తెలిసిందే.
Read More :
Mercedes-Benz with Google | గూగుల్‌తో మెర్సిడెజ్ పార్టనర్షిప్.. టెస్లా బీవైడీ కార్లతో సై అంటే సై..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

