హైదరాబాద్ : అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam) ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కనీసం హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విచారం వ్యక్తం చేశారు.
అమరులని బీఆర్ఎస్ పార్టీ అన్ని సందర్భాల్లో గుర్తుంచుకొని గౌరవించుకుందని, అసెంబ్లీ (Assembly) తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (Brs Mla’s) గన్‌పార్క్‌కు వెళ్లి నివాళ్లు అర్పించారని గుర్తు చేశారు.