Harish Rao | ప్రభుత్వ అవినీతిని, కుంభకోణాలను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించినందుకు ఆయన సతీమణి లక్ష్మీభాయిని కాంగ్రెస్ సర్కార్ ఆకస్మకంగా బదిలీ చేసిందని తెలిసిందే. లక్ష్మీభాయిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్ట్ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ కో ఆపరేషన్ శాఖలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేస్తూ నిమిషాల్లో ఆర్డర్స్ జారీ చేసిందని తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయిని కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసిందని ఆరోపించారు. ఇంత చిల్లర రాజకీయమా రేవంత్.. ? అని ఫైర్ అయ్యారు.
శ్రీధర్ బాబు సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు… మేము ఆయన సతీమణిని ఇలాగే ఇబ్బంది పెట్టామా..? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించారు. రిటైర్ అయ్యే ఏడాది ముందు నిబంధనలకు విరుద్ధంగా ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారని హరీశ్ రావు మండిపడ్డారు.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయి గారిని బదిలీ చేసిన కాంగ్రెస్ సర్కార్!
ఇంత చిల్లర రాజకీయమా రేవంత్?
శ్రీధర్ బాబు గారి సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు… మేము ఆయన సతీమణిని ఇలాగే ఇబ్బంది పెట్టామా?
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను… pic.twitter.com/NiRWiSdb3r
— BRS Party (@BRSparty) July 2, 2026